బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (08:55 IST)

పండగ పూట పసిడి ధరల దూకుడు

దేశం వ్యాప్తంగా దీపాపడి ఫెస్టవల్ మూడ్ కొనసాగుతోంది. దీంతో అనేక మంది మహిళలు తమకు ఇష్టమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ ధరలు మాత్రం రోజురోజూ పెరిగిపోతున్నాయి. 
 
తాజాగా, బుధవారం లెక్కల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ.45,200కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగి రూ.49,150కి చేరింది.
 
అయితే, బంగారం ధర పెరిగితే… వెండి ధరలు మాత్రం బుధవారం కాస్త తగ్గాయి. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.70,200 వద్దకు చేరుకుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు ఆర్థిక నిపుణులతో పాటు.. బంగారు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితి సంక్రాంతి వరకు కొనసాగవచ్చని పేర్కొన్నారు.