ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 17 నవంబరు 2022 (22:49 IST)

భారతదేశంలో 100 బ్లూ స్క్వేర్‌ ఔట్‌లెట్ల మైలురాయిని వేడుక చేసిన యమహా

Yamaha
ఇండియా యమహా మోటర్‌ (ఐవైఎం) ప్రైవేట్‌ లిమిటెడ్‌ నేడు భారతదేశంలో 100 బ్లూ స్క్వేర్‌ షోరూమ్స్‌ మైలురాయిని చేరుకున్నట్లు వెల్లడించింది. తమ మొత్తం 3 ఎస్‌ నెట్‌వర్క్‌ను యమహా బ్లూ నేపథ్యంతో ఏర్పాటు చేయడంతో పాటుగా భారతదేశంలో తమ రిటైల్‌ ఫుట్‌ప్రింట్‌ను బలోపేతం చేయాలనే నిబద్ధతకు అనుగుణంగా ఇది జరిగింది. కాల్‌ ఆఫ్‌ ద బ్లూ బ్రాండ్‌ ప్రచారాన్ని 2018లో పరిచయం చేశారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా 2019లో ఈ బ్లూ స్క్వేర్‌ షోరూమ్స్‌ను బ్రాండ్‌ యొక్క ప్రీమియం ఇమేజ్‌ను ప్రదర్శిస్తూ ఏర్పాటుచేశారు.
 
యమహా యొక్క బ్లూ స్క్వేర్‌ షోరూమ్‌లు వినియోగదారుల బైకింగ్‌ అవసరాలన్నీ ఒకే చోట లభిస్తాయి. అంతేకాకుండా యమహా క్యూరేట్‌ చేసిన బ్లూ స్ట్రీక్స్‌ రైడర్‌ కమ్యూనిటీలో వినియోగదారులు భాగమయ్యే అవకాశం కూడా కల్పిస్తుంది. ఈ సందర్భంగా యమహా మోటార్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ శ్రీ ఐషిన్‌ చిహానా మాట్లాడుతూ ‘‘కాల్‌ ఆఫ్‌ ద బ్లూ బ్రాండ్‌ డైరెక్షన్‌లో భాగంగా యమహా విజయవంతంగా 100 బ్లూ స్క్వేర్‌ షోరూమ్‌ మైలురాయిని భారతదేశంలో పూర్తి చేసిందని వెల్లడించేందుకు సంతోషిస్తున్నాము. యమహా యొక్క ప్రతిష్టాత్మక శ్రేణి డీలర్‌షిప్స్‌ బ్లూ స్క్వేర్‌ షోరూమ్స్‌. ఇవి అత్యున్నత శ్రేణి వినియోగదారుల సంతృప్తి మరియు యాజమాన్య అనుభవాలను అందిస్తాయి. భారతదేశ వ్యాప్తంగా బ్లూ స్క్వేర్‌ షోరూమ్‌లను ఏర్పాటుచేయడమన్నది సేల్స్‌, సర్వీస్‌, వినియోగదారుల సంతృప్తి పరంగా బెంచ్‌మార్క్‌ సృష్టించడంలో భాగం. భారతదేశంలో ప్రతి వినియోగదారునికీ సేవలనందించే రీతిలో బ్లూ స్క్వేర్‌ ఔట్‌లెట్లను విస్తరించనున్నాము’’ అని అన్నారు.
 
ఈ బ్లూ స్క్వేర్‌ ఔట్‌లెట్ల వద్ద యమహా యొక్క ప్రీమియం శ్రేణి మోటర్‌సైకిల్స్‌, స్కూటర్లు అయిన ఏరాక్స్‌ 155 మరియు వైజెడ్‌ఎఫ్‌-ఆర్‌15ఎంతో పాటుగా మోటోజీపీ ఎడిషన్స్‌ ప్రదర్శిస్తారు. వీటితో పాటుగా కంపెనీ యొక్క అంతర్జాతీయ శ్రేణి సైతం పరిచయం చేయడానికి  ప్రణాళిక చేశారు.