Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంథే 2026ను ప్రారంభించిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్: విద్యార్థుల ప్రతిభాన్వేషణ పరీక్ష

Updated: శుక్రవారం, 28 ఆగస్టు 2026 (22:09 IST)
పోటీతత్వంతో కూడిన విద్యా ప్రయాణానికి సిద్ధమవుతున్న విద్యార్థికి, ఏమి చదవాలో తెలుసుకోవడం అనేది ఆ ప్రక్రియలో ఒక భాగం మాత్రమే. తాము ఏ స్థాయిలో ఉన్నారో, ఏ విషయాలలో రాణిస్తున్నారో, ఎక్కడ మెరుగుపడాల్సిన అవసరం ఉందో అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సన్నద్ధతకు, స్వీయ అవగాహనకు మధ్య ఉన్న ఈ అంతరాన్ని పూరించడానికే గత 16 సంవత్సరాలుగా ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్(ANTHE) ప్రయత్నిస్తోంది.
 
ఆంథే ప్రారంభమైనప్పటి నుండి ఒక కోటి మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకోవడంతో, ఈ పరీక్ష భారతదేశంలోని అతిపెద్ద, అత్యంత సుదీర్ఘకాలంగా నడుస్తున్న విద్యార్థి మూల్యాంకన వేదికలలో ఒకటిగా ఎదిగింది. ప్రతిభను గుర్తించే కార్యక్రమంగా ప్రారంభమైన ఆంథే, ఇప్పుడు ఒక క్రమబద్ధమైన విద్యా ప్రమాణంగా రూపాంతరం చెందింది. ఇది విద్యార్థులు తమ సన్నద్ధతను అంచనా వేసుకోవడానికి, వారి పోటీ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి, భవిష్యత్ ప్రయాణానికి బలమైన పునాది వేసుకోవడానికి సహాయపడుతుంది.
 
కేవలం తుది స్కోరు ద్వారా మాత్రమే విద్యార్థి ప్రతిభను కొలిచే మూల్యాంకనానికి భిన్నంగా, ఆంథే ఒక సమగ్రమైన, శాస్త్రీయంగా నిర్మాణాత్మకమైన నిర్ధారణాత్మక మూల్యాంకనంగా రూపొందించబడింది. ప్రతి ప్రశ్న ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం, నిర్దిష్ట భావనలు, సామర్థ్యాలకు గుర్తించేందుకు అనుగుణంగా రూపొందించబడింది. దీనివల్ల విద్యార్థులను విషయ పరిజ్ఞానం, అభిరుచి, విశ్లేషణాత్మక సామర్థ్యం, పరీక్షా ప్రవర్తన వంటి అంశాలలో మూల్యాంకనం చేయడానికి వీలవుతుంది. దీంతో విద్యార్థులు తమ ప్రతిభను ఒకే సంఖ్యకు పరిమితం చేయకుండా, తమ పనితీరు, బలాలు, మెరుగుపరుచుకోవాల్సిన అంశాలపై మరింత స్పష్టమైన అవగాహన పొందగలుగుతారు. 
 
జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థుల ప్రయాణాలలో కూడా ఈ ముందస్తు అంచనా యొక్క ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తుంది. నీట్ యుజి 2026లో, మొదటి 100 ర్యాంకులు సాధించిన 41 మంది ఆకాష్ విద్యార్థులలో 31 మంది అంతకుముందు ఆంథే  ద్వారా అర్హత సాధించినవారే. అలాగే, జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో మొదటి 100 లోపు ర్యాంక్ లను సాధించిన ఆకాష్ విద్యార్థులు 11 మందిలో ఏడుగురు ఆంథే విద్యార్థులే ఉన్నారు. ఈ ఫలితాలు విద్యార్థుల పోటీ పరీక్షల ప్రయాణంలో ప్రారంభ దశలోనే వారి సామర్థ్యాలను గుర్తించడం, క్రమబద్ధమైన విద్యా ప్రణాళికతో సిద్ధం చేయడం, నిరంతరం మార్గనిర్దేశం అందించడం ఎంత కీలక పాత్ర పోషిస్తాయో స్పష్టం చేస్తున్నాయి.
 
ఆంథే ప్రాముఖ్యత గురించి ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఈఎస్ఎల్) ఎండి, సీఈఓ అయిన శ్రీ చంద్ర శేఖర్ గరిస రెడ్డి మాట్లాడుతూ, మా దృష్టిలో, ఆంథే అనేది కేవలం విద్యార్థికి లభించే స్కాలర్‌షిప్‌ను నిర్ణయించే పరీక్ష మాత్రమే కాదు. సరైన మార్గదర్శకత్వం, ఎంతో ప్రభావం చూపగల కీలక దశలో, విద్యార్థులు తమ విద్యాపరమైన సామర్థ్యాన్ని తామే స్వయంగా అర్థం చేసుకోవడంలో సహాయపడటమే దీని ప్రధాన ఉద్దేశ్యం. గత 16 ఏళ్లుగా, కోటి మందికి పైగా విద్యార్థులు తమ సామర్ధ్యాన్ని అంచనా వేసుకోవడానికి, తమ ప్రస్తుత స్థాయిని తెలుసుకోవడానికి ఆంథే ని ఒక గొప్ప అవకాశంగా భావించి విశ్వసించారు. ఈ పరీక్ష యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం విద్యార్థి సాధించిన మార్కులను మాత్రమే కాకుండా వారి బలాలు, సన్నద్ధత , మెరుగుపరచుకోవాల్సిన అంశాల గురించి లోతైన అవగాహనను కల్పిస్తుంది. ప్రతి విద్యార్థి ఆంథే ద్వారా తమ విద్యా ప్రయాణంపై మరింత స్పష్టతను, భవిష్యత్తు కోసం సరైన అవగాహనతో కూడిన మార్గాన్ని పొందాలని మేము కోరుకుంటున్నాము అని అన్నారు. 
 
ఈ పరీక్ష విలువ దాన్ని రాసి, పూర్తి చేయడంతో ముగిసిపోదు. పరీక్ష అనంతరం విద్యార్థులకు అందే ఫలితాలు, అవగాహన, మార్గనిర్దేశంలోనే దాని అసలు ప్రయోజనం కనిపిస్తుంది. ఆంథేలో పాల్గొనే ప్రతి విద్యార్థికి సమగ్రంగా రూపొందించిన ‘ఆంథే ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌’ అందుతుంది. పరీక్షలో సాధించిన ఫలితాలను కేవలం స్కోర్‌గా చూపించకుండా, విద్యార్థి విద్యా సామర్థ్యంపై ఉపయోగకరమైన, ఆచరణాత్మకమైన అవగాహన కల్పించేలా ఈ నివేదికను రూపొందించారు. ఈ రిపోర్ట్, విద్యార్థులు తమ సబ్జెక్టుల వారీగా ఉన్న బలాబలాలను, ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అంశాలను గుర్తించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో, పోటీ పరీక్షల డిమాండ్లను ఎదుర్కోవడానికి తాము ఎంతవరకు సిద్ధంగా ఉన్నామనే దానిపై వారికి ఒక అవగాహనను కూడా అందిస్తుంది.
 
ఈ రిపోర్ట్ ఒక విద్యార్థి ప్రతిభకు సంబంధించిన మూడు విభిన్న అంశాలను మరింతగా పరిశీలిస్తుంది-కాంపిటీటివ్ ఎగ్జామ్ సక్సెస్ పొటెన్షియల్ (CESP), టెస్ట్-టేకింగ్ పర్సనాలిటీ(TTP), అటెంప్ట్ ఇంటెలిజెన్స్ కోషెంట్(AIQ). వీటి ద్వారా విద్యార్థి పరీక్షను ఎలా ఎదుర్కొంటున్నాడనే దానిపై మరింత సమగ్ర అవగాహన లభిస్తుంది. ఉన్నత స్థాయి ఆలోచనా సామర్థ్యం, పోటీ పరీక్షల్లో సవాళ్లను ఎదుర్కొనే తీరు నుంచి... పరీక్ష సమయంలో అనుసరించే విధానం, ప్రశ్నలను ఎంచుకోవడంలో తీసుకునే నిర్ణయాలు, ఖచ్చితత్వం, రిస్క్‌ మధ్య పాటించే సమతుల్యత వరకు విద్యార్థి పరీక్షను ఎలా రాస్తున్నాడో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
 
దీనివల్ల, ఇప్పటికే జెఈఈ లేదా నీట్ కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకే కాకుండా, తమ విద్యా ప్రయాణంలో ఇంకా ప్రారంభ దశలో ఉన్నవారికి కూడా ఆంథే ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. జాతీయ బెంచ్‌మార్కింగ్‌ను అందించడం ద్వారా విద్యార్థులు తమ రాష్ట్రం, దేశవ్యాప్తంగా ఉన్న తోటివారితో పోలిస్తే తాము ఏస్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోగలరు. ఈ మూల్యాంకనం, పోటీ పరీక్షల దృక్కోణం నుండి తమ పనితీరును పరిశీలించుకోవడానికి, ముందుకు సాగుతున్న కొద్దీ తాము ఏ అంశాలలో బలోపేతం కావాలో గుర్తించడానికి వారికి వీలు కల్పిస్తుంది.
 
ఆంథే ప్రధానంగా ఒక విషయాన్ని విశ్వసిస్తుంది, మూల్యాంకనం అనేది ఫలితాన్ని చెప్పడంతో ముగియకూడదు.. ఆ ఫలితాన్ని ఆధారంగా చేసుకుని తదుపరి అడుగు వేయించేలా ఉండాలి. ఒక విద్యార్థి ఫలితం కేవలం వారు బాగా రాణించారా లేదా అని మాత్రమే చెప్పకూడదు; వారు దేనిలో రాణిస్తున్నారో, ఎక్కడ మెరుగుపడాల్సిన అవసరం ఉందో, తదుపరి దేనిపై దృష్టి పెట్టాలో అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో కూడా అది సహాయపడాలి. విద్యా సామర్థ్యాన్ని అంచనా వేయడంతో పాటు, పోటీ పరీక్షలకు విద్యార్థి సన్నద్ధత, పరీక్షను ఎదుర్కొనే తీరును కూడా పరిగణనలోకి తీసుకుంటూ ఆంథే రూపొందించబడింది. విద్యార్థి తన విద్యా ప్రయాణంలో అత్యంత కీలకమైన, సవాళ్లతో కూడిన దశకు చేరుకునేలోపే.. తన సామర్థ్యం, సన్నద్ధత, మెరుగుపరుచుకోవాల్సిన అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించడమే ఆంథే లక్ష్యం.
 
అర్హులైన విద్యార్థులు ఆకాష్ యొక్క క్లాస్‌రూమ్, హైబ్రిడ్, డిజిటల్ ప్రోగ్రామ్‌లను పొందేందుకు వీలు కల్పిస్తూ, స్కాలర్‌షిప్‌లు ఆంథే యొక్క ఒక ముఖ్యమైన ఫలితంగా నిలుస్తాయి. ఆంథే 2026 కోసం, విద్యార్థులు వర్తించే ప్రమాణాలకు లోబడి 100% వరకు స్కాలర్‌షిప్‌లను పొందవచ్చు, దీనితో పాటు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రూ. 2.5 కోట్ల నగదు బహుమతులు కూడా లభిస్తాయి. ఈ పరీక్ష 5వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది. ఇది ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పద్ధతులలో నిర్వహించబడుతుంది.
 
ఆంథే  2026 కొరకు రిజిస్ట్రేషన్లు ఇప్పుడు అధికారిక ఆంథే  పోర్టల్ మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఆకాష్ కేంద్రాల ద్వారా ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్ పరీక్ష 2026 అక్టోబర్ 27 నుండి నవంబర్ 1 వరకు నిర్వహించబడుతుంది, కాగా ఆఫ్‌లైన్ పరీక్ష 2026 అక్టోబర్ 11, 25 మరియు నవంబర్ 1 తేదీలలో జరుగుతుంది.
About Author
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... Read More

అన్నీ చూడండి

ముంబైలో శ్రీవాస్ దర్శకుడిగా ఫీనిక్స్ రాజా ఫస్ట్ పోస్టర్, 2D మోషన్ టీజర్‌ రిలీజ్

Mohabbat: మొహబ్బత్ నుంచి శ్రేయాసి సేన్ బ్యూటీఫుల్ పోస్టర్

పూరి జగన్నాథ్ ఆవిష్కరించిన చకోర- లూనార్ లవ్ బర్డ్ మూవీ మోషన్ పోస్టర్

Vivek Athreya : రవితేజ, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో కొత్త సినిమా

Sharva: పల్లెటూరి కుర్రాడి గా భోగి చిత్రంలో తోబుట్టువులతో శర్వా

తర్వాతి కథనం
Show comments