బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 4 నవంబరు 2024 (23:41 IST)

బీబీఈ పరీక్షను నిర్వహించనున్న FIIT JEE

students
విద్యా రంగంలో తమ సహకారం & ఆవిష్కరణల దిశగా గణనీయమైన పురోగతిలో, దేశంలోని జెఈఈ, ఇతర పోటీ & స్కాలస్టిక్ పరీక్షల కోసం ప్రముఖ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ అయిన FIITJEE తమ ఐకానిక్ బిగ్ బ్యాంగ్ ఎడ్జ్(బీబీఈ) పరీక్ష 2024ని V నుండి XI తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లు  ప్రకటించింది. విద్యార్థుల సమగ్ర విద్యా సామర్థ్యాన్ని బిగ్ బ్యాంగ్ ఎడ్జ్ టెస్ట్ అంచనా వేస్తుంది, తద్వారా వారు తమ విద్యా నైపుణ్యాలు, అభిరుచులపై సమగ్ర పరిజ్ఞానం పొందవచ్చు. 
 
బిగ్ బ్యాంగ్ ఎడ్జ్ (BBE) పరీక్ష అనేది ప్రతి సంవత్సరం FIITJEE ద్వారా నిర్వహించబడే ప్రత్యేకమైన డయాగ్నోస్టిక్ పరీక్ష. BBE ద్వారా, విద్యార్థులు తమ ఆప్టిట్యూడ్, ఎనలిటికల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, సమస్య-పరిష్కార నైపుణ్యాల గురించి చక్కటి అవగాహన పొందుతారు. ఈ పరీక్షతో విద్యార్థులు తమ బలాలు & బలహీనతలను విశ్లేషించగలరు, వారి విద్యాసంబంధమైన అభిరుచిని గుర్తించగలరు, తద్వారా వారు సరైన కెరీర్ మార్గాన్ని ఎంచుకోవచ్చు.
 
బిగ్ బ్యాంగ్ ఎడ్జ్ టెస్ట్ విద్యార్థుల ప్రస్తుత- సంభావ్య సామర్థ్యాన్ని వెల్లడిస్తుంది. నిపుణుల మార్గదర్శకత్వంతో వాంఛనీయ విజయం కోసం అనుసరించాల్సిన సరైన విద్యా మార్గాన్ని సూచిస్తుంది. ఇది కోచింగ్ పరిశ్రమకు ఒక బెంచ్‌మార్క్‌ని సెట్ చేయడానికి రూపొందించిన ఒక సమగ్ర పరీక్ష.  ఈ పరీక్ష అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను కూడా అందిస్తుంది అని FIITJEE గ్రూప్ డైరెక్టర్ శ్రీ ఆర్ఎల్ త్రిఖా అన్నారు.
 
ప్రస్తుతం V, VI, VII, VIII, IX, X & XI తరగతుల విద్యార్థులు పరీక్షకు హాజరు కావడానికి అర్హులు. రిజిస్ట్రేషన్ త్వరలో తెరవబడుతుంది మరియు విద్యార్థులు వెబ్‌సైట్ fiitjee.com/bbeని సందర్శించడం ద్వారా లేదా ఆఫ్‌లైన్‌లో ఏదైనా FIITJEE కేంద్రాన్ని సందర్శించడం ద్వారా పరీక్ష కోసం నమోదు చేసుకోవాలి.
 
నవంబర్ 17, 2024న జరిగే ఆఫ్‌లైన్ మోడ్‌కు రిజిస్టర్ చేసుకోవడానికి 15 నవంబర్ 2024, నవంబర్ 18, 2024న జరిగే ఆన్‌లైన్ మోడ్ కోసం నవంబర్ 16, 2024 లను నమోదు చేసుకోవడానికి చివరి తేదీలు.