బుధవారం, 21 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2023 (14:24 IST)

ఐబీపీఎస్ పీవో ఫలితాలను వెల్లడి... త్వరలో ఇంటర్వ్యూలు

ఐబీపీఎస్ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంటర్వ్యూలను త్వరలోనే నిర్వహించనున్నారు. ఈ ఫలితాలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) ఈ నెల 5వ తేదీన బుధవారం విడుదల చేసింది. 
 
పీవో నియామక ప్రధాన పరీక్షను దేశ వ్యాప్తంగా గత యేడాది నవంబరు నెల 26వ తేదీన నిర్వహించగా, తాజాగా ఈ ఫలితాలను వెల్లడించారు. అయితే, ఈ ఫలితాలను ఈ నెల 16వ తేదీ తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపింది. 
 
పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారికి వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్, మొబైల్ నంబరు, పాస్‌వర్డ్ నమోదు చేసి ఫలితాలను చూడొచ్చు. మెయిన్స్‌‍లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన కాల్ లెటర్స్ ఈ నెల లేదా వచ్చే నెలలో వచ్చే అవకాశం ఉంది.