సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By వరుణ్
Last Updated : సోమవారం, 2 జనవరి 2023 (19:18 IST)

నాలాంటి కంత్రీగాడితో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది.. అజిత్ "తెగింపు" ట్రైలర్ రిలీజ్

tegimpu trailer
తమిళ అగ్ర నటుడు అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం "తెగింపు". తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతిని పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే, ఇప్పటికే తమిళ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా, తాజాగా తెలుగులో కూడా ట్రైలర్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, జీ స్టూడియోస్‌తో కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మంజు వారియర్ హీరోయిన్‌గా నటించారు. 
 
తాజాగా తెలుగు తెగింపు ట్రైలర్‌ను రిలీజ్ చేయగా, దీన్ని యాక్షన్‌కు సంబంధించిన సన్నివేశాలపైనే రూపొందించారు. హెలికాఫ్టర్లు, పవర్ బోట్లు, ఛేజింగ్స్‌లతో భారీ హంగులతో చూపించారు. అలాగే, అజిత్‌ కూడా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో డిజైన్ చేశారు. ఇందులో సముద్రఖని, అజయ్‌‌లు నటించగా, వీరిద్దరూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించినట్టు తెలుస్తోంది. హీరోయిన్‌కు కూడా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నట్టు తెలుస్తోంది.