శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 మే 2020 (17:21 IST)

జులై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్స్.. జూలై 26న నీట్ పరీక్షలు

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన పరీక్షల కోసం కేంద్రం తేదీలను ప్రకటిస్తూ వస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం వివిధ పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది. జులై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ జులై 26న ఉంటుందని కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఆగస్టులో జరగొచ్చునని తెలిపారు. 
 
కానీ పరీక్షా తేదీలు మాత్రం ఇంకా నిర్ణయించలేదని చెప్పుకొచ్చారు. పరీక్ష తేదీలు ఇంకా నిర్ణయించలేదు. సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల కొత్త తేదీలు ఈ వారంలో ప్రకటించే అవకాశం వుంది.