గురువారం, 18 జులై 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జూన్ 2022 (12:43 IST)

టెన్త్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో కొత్తగా 458 ఉద్యోగాలు

russian army
భారత ఆర్మీలో 458 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేశారు. భారత రక్షణ శాఖ, ఇండియన్ ఆర్మీకి చెందిన ఉత్తర, దక్షిణ ఏఎస్సీ సెంటర్లలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేశారు. ఇందులో నార్త్, సౌత్‌లలో కలిపి 458 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దక్షిణ ఏఎస్సీ సెంటరులో 209 పోస్టులు, ఉత్తర ఏఎస్సీ సెంటరులో 249 పోస్టులు ఉన్నాయి. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 27 యేళ్ల మధ్య ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
 
మొత్తం 150 మార్కులకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలుగా ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీలలో ఉంటుంది. ఈ పోస్టులన్నీ గ్రూపు సిగా పరిణిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పది లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.