1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2022 (11:16 IST)

IDBI బ్యాంకులో 1544 ఉద్యోగాలుః జూన్‌ 3 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఇండస్ట్రియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) అసిస్టెంట్‌ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1544 పోస్టులను భర్తీ చేయనుంది. 
 
ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 3 నుంచి ప్రారంభమవుతుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జూన్‌ 17 వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. 
 
ఐడీబీఐ బ్యాంక్‌ మణిపాల్‌,  గ్రేటర్ నోయిడా విద్యాసంస్థలతో కలిసి బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ విభాగంలో ఏడాది పాటు పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమాలో ట్రెయినింగ్ ఇస్తుంది.
 
ఈ ట్రైనింగ్‌ 9 నెలలు క్లాస్‌ రూం శిక్షణ కాగా.. 3 నెలలు ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఈ కోర్సు విజయవంతగా పూర్తి చేసిన వారికి అసిస్టెంట్‌ మేనేజర్ ఉద్యోగం కల్పిస్తారు.   
 
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 03, 2022
దరఖాస్తులకు చివరి తేది: జూన్‌ 17, 2022
ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు రాత పరీక్ష తేదీ: జులై 9, 2022
అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు రాత పరీక్ష తేదీ: జులై 23, 2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.idbibank.in/