శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చైనీస్
Written By Selvi
Last Updated : మంగళవారం, 3 జూన్ 2014 (13:22 IST)

చైనీస్ ఫ్రైడ్ చికెన్ లెగ్స్ ఎలా చేయాలో తెలుసా?

చైనీస్ ఫ్రెడ్ చికెన్ లెగ్స్ టేస్ట్‌గా ఉంటుంది. కానీ క్యాలరీలు ఎక్కువ. తద్వారా బరువు పెరిగే అవకాశం ఉంది. కానీ ఈ రిసిపీ ఆయిల్‌తో డీప్ ఫ్రై కాకుండా స్టైర్ ఫ్రై చేసుకుని టేస్ట్ చేస్తే కాలరీలు తక్కువగా ఉంటాయి. ఈ రిసీపీ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు 
చికెన్ లెగ్స్ : 6 
చైనీస్ గ్రాస్ : చిటికెడు
వెనిగర్ : 3 టీ స్పూన్లు,
పెప్పర్ పౌడర్ : 2 టీ స్పూన్లు 
ఉల్లి పాయ తరుగు : అర కప్పు 
సోయా సాస్ : రెండు టేబుల్ స్పూన్లు 
ఉప్పు, నూనె : సరిపడా 
 
తయారీ విధానం :
ముందుగా చికెన్ పీస్‌లను బాగా శుభ్రం చేసుకుని, వెనిగర్, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పది నిమిషాలు పక్కన బెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లో సోయాసాస్, పచ్చిమిర్చి, చైనీస్ గ్రాస్ వేసి బాగా మిక్స్ చేయాలి. 
 
పిమ్మట చికెన్ లెగ్స్‌ను సోయా మిక్సర్‌లో డిప్ చేయాలి. వాటిని బయటకు తీసి కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండిలో వేసి పొర్లించాలి. అంతలోపు ఫ్రైయింగ్ పాన్‌లో నూనెవేసి, స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చికెన్ లెగ్స్‌ను అందులో వేయాలి.  ఈ పీస్‌లు దోరగా వేయించుకోవాలి. 
 
రెండు నిముషాల తర్వాత మంట తగ్గించి అందులో ఉల్లిపాయ ముక్కలు పెప్పర్ కూడా వేసి క్రిస్పీగా వేయించుకోవాలి. అంతే క్రిస్పీ చైనీస్ చికెన్ లెగ్స్ రెడీ. వీటిని డీప్ ఫ్రై చేయకూడదు.