మైదాపిండితో చిప్స్ చేసేటప్పుడు పొటాటోను ఉడికించి?
* మైదాపిండితో చిప్స్ చేసేటప్పుడు బంగాళాదుంపలు ఉడికించి పిండిలో కలిపితే చిప్స్ కరకరలాడుతాయి. * పాపడ్‌లు వేయించేముందు కొద్దిసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువ లాగకుండా ఉంటుంది. * వెల్లుల్లితో కలిపి బంగాళాద
* మైదాపిండితో చిప్స్ చేసేటప్పుడు బంగాళాదుంపలు ఉడికించి పిండిలో కలిపితే చిప్స్ కరకరలాడుతాయి.
* పాపడ్‌లు వేయించేముందు కొద్దిసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువ లాగకుండా ఉంటుంది.
* వెల్లుల్లితో కలిపి బంగాళాదుంపలు ఉంచితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి.
* బెండకాయలు తాజాగా ఉండాలంటే రెండువైపులా తొడిమెలు తీసి కవర్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి.
* కాకరకాయ కూరలో సోంపు గింజలు.. బెల్లం వేస్తే చేదును లాగేస్తుంది. కూర రుచిగా ఉంటుంది.
* పాలలో జున్ను తీసేటప్పుడు పైన నీరు పారబొయ్యకుండా పిండిలో కలుపుకోవచ్చు. లేదా కూరల్లో వేస్తే కూర రుచిగా ఉంటుంది.