మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : గురువారం, 25 జనవరి 2018 (13:58 IST)

వంటింటి చిట్కాలు: ఆకుకూరతో వేరుశెనగల్ని చేర్చి ఉడికిస్తే?

వంటనూనెలో రెండు మూడు మిరపకాయ వడియాలను వేసివుంచితే చాలారోజుల వరకు చెడకుండా వుంటుంది. రసం తయారించేటప్పుడు కొబ్బరి నీటితో కాస్త చేర్చుకుంటే.. రసం రుచిగా వుంటుంది. బజ్జీలు చేసేందుకు కట్ చేసి పెట్టుకున్న అ

వంటనూనెలో రెండు మూడు మిరపకాయ వడియాలను వేసివుంచితే చాలారోజుల వరకు చెడకుండా వుంటుంది. రసం తయారించేటప్పుడు కొబ్బరి నీటితో కాస్త చేర్చుకుంటే.. రసం రుచిగా వుంటుంది.

బజ్జీలు చేసేందుకు కట్ చేసి పెట్టుకున్న అరటికాయలు, బంగాళాదుంపల ముక్కలకు ఉప్పు, కారం పట్టించి.. అర్ధ గంట తర్వాత బజ్జీ పిండితో ముంచి.. నూనెలో వేపుకుంటే బజ్జీలు రుచిగా వుంటాయి.
 
వేపుళ్లు లేదా ఉప్మాల్లో కారం అధికమైతే రస్క్ లేదా బ్రెడ్ పొడిని చల్లితే సరిపోతుంది. ఎండని వేరు శెనగలను ఆకుకూరలతో కలిపి ఉడికించి రుబ్బుకుంటే ఆకుకూర టేస్ట్ అదిరిపోతుంది. బియ్యం ముప్పావు వంతు వేరుశెనగలు పావు వంతు చేర్చుకుని రుబ్బుకుని దోసెలు పోసుకుంటే రుచిగా వుంటాయి. 
 
ఉలవలతో టమోటా, ఉల్లిపాయలు, మిరపకాయలు చేర్చి ఉడికించి పప్పు చారు చేస్తే రుచి బాగుంటుంది. చపాతీలు మృదువుగా రావాలంటే.. ఉడికించిన బంగాళాదుంపల్ని గోధుమ పిండితో కలిపితే సరిపోతుంది.