మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By chj
Last Modified: గురువారం, 30 నవంబరు 2017 (21:03 IST)

మునగ- టమోటా కలిపి తింటే...

మునగలో క్యాల్షియం ఎక్కువ. పెరిగే పిల్లలకు, గర్భిణులకు ఇది దివ్యౌషధం. పీచుపదార్థం సమృద్ధిగా ఉండే మునక్కాయ జీర్ణవ్యవస్థ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది. ఇంకా మునక్కాడతో తయారుచేసే రసాన్ని లేదా సూప్‌ను త్రాగడం వల్ల దగ్గు, కఫం వంటి శ్వాసకోస సమస్యల నుండి

మునగలో క్యాల్షియం ఎక్కువ. పెరిగే పిల్లలకు, గర్భిణులకు ఇది దివ్యౌషధం. పీచుపదార్థం సమృద్ధిగా ఉండే మునక్కాయ జీర్ణవ్యవస్థ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది. ఇంకా మునక్కాడతో తయారుచేసే రసాన్ని లేదా సూప్‌ను త్రాగడం వల్ల దగ్గు, కఫం వంటి శ్వాసకోస సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక మునగ టమోటా కూర ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
టమోటాలు : ఒక కేజీ 
మునక్కాయలు : ఐదు 
అల్లం, వెల్లుల్లి  పేస్ట్ :  ఒక టేబుల్ స్పూన్ 
గరం మసాలా, ధనియాల పొడి- చెరో అర టీ స్పూన్
పోపుకోసం.. మినపప్పు, ఆవాలు, జీలకర్ర: ఒక్కో టీ స్పూన్ 
పచ్చి మిర్చి : ఐదు,
కారం : అర టీ స్పూన్ 
కరివేపాకు, కొత్తిమీర తరుగు: ఒక టేబుల్ స్పూన్ 
ఉప్పు, నూనె : తగినంత 
 
తయారీ విధానం :
ముందుగా స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక పోపు కోసం సిద్ధం చేసుకున్న దినుసులతో పాటు కరివేపాకు వేసి వేగించాలి. దోరగా వేగాక అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేపాలి. తర్వాత ఉల్లి, మునగ, పచ్చిమిర్చి చీలికలు వేసి 5-10 నిముషాలు వేపాలి. 
 
తర్వాత టమోటా ముక్కలు, చిటికెడు పసుపు కారం వేసి మూత పెట్టాలి. 5 నిమిషాలు ఆగి గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసి మరలా ముత పెట్టి కూరను ఉడికించాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు జత చేసుకోవచ్చు. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే మునక్కాయ టమోటో కూర రెడీ. ఈ కూరను రోటీలకు లేదా అన్నంలో సైడ్ డిష్‌గా వాడుకోవచ్చు.