పెరుగును ముఖానికి అప్లై చేసుకుంటే?
పెరుగు ఆరోగ్యానికే కాదు.. సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పెరుగును చర్మానికి పూతలా వేసుకుని 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇందులోని లాక్టిక యాసిడ్ చర్మ రంధ్రాల
పెరుగు ఆరోగ్యానికే కాదు.. సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పెరుగును చర్మానికి పూతలా వేసుకుని 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇందులోని లాక్టిక యాసిడ్ చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన దుమ్ము, ధూళికళాణలను తొలగించి మెరిసే సౌందర్యాన్నిస్తుంది. ఇక యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండే తేనె చర్మాన్ని సున్నితంగా మార్చటమే కాకుండా, యవ్వనంగా కనపడేలా చేస్తుంది.
ఒక చెంచా తేనెను తీసుకొని, దానికి చిటికెడు దాల్చిన చెక్క కలిపి ముఖానికి అప్లై చేయాలి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా రోజు చేయటం వలన ముఖకాంతి రెట్టింపు అవుతుంది. అలాగే వంటల్లో ఉపయోగించే టమోటాలను గుజ్జుగా తీసుకుని అందులో కొంత నిమ్మరసాన్ని చేర్చి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే.. చర్మం నిగారింపులు సంతరించుకుంటుంది. టమోటాలో ఉండే లైకోపీన్ అనే సమ్మేళనం చర్మాన్ని తాజాగా వుంచుతుంది.