సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 జనవరి 2017 (16:07 IST)

బంగాళాదుంప చిప్స్ వద్దు.. కూరగా వండుకుని తింటే మంచిదట..

నూనెలో వేయించుకునే బంగాళాదుంప చిప్స్ అంటే లొట్టలేసుకుని తినేస్తాం. ఇలా తింటే ఊబకాయం తప్పదు. ఇలా బంగాళాదుంపను ఫ్రై, చిప్స్ రూపంలో కాకుండా ఊదా రంగులో ఉండే బంగాళాదుంపను నూనెలో వేయించకుండా కూర వండుకుని తి

నూనెలో వేయించుకునే బంగాళాదుంప చిప్స్ అంటే లొట్టలేసుకుని తినేస్తాం. ఇలా తింటే ఊబకాయం తప్పదు. ఇలా బంగాళాదుంపను ఫ్రై, చిప్స్ రూపంలో కాకుండా ఊదా రంగులో ఉండే బంగాళాదుంపను నూనెలో వేయించకుండా కూర వండుకుని తింటే మంచిదని సూచిస్తున్నారు. కూర వండుకుని బంగాళాదుంపను తీసుకోవడం ద్వారా అధిక బరువు, రక్తపోటును దూరం చేసుకోవచ్చునని పరిశోధనలో తేలింది. 
 
సాధారణంగా నూనెలో వేయించిన బంగాళాదుంపను తినడం వల్ల ఉపయోగాలు లేకపోగా అది ఎటువంటి క్యాలరీలను అందజేయదని పరిశోధనలో నిర్ధారించారు. ఒక బంగాళాదుంపలో 110 క్యాలరీ పోషకాలు ఉంటాయి.
 
ఊబకాయం ఉన్న పద్దెనిమిది మందికి నాలుగు వారాలపాటు ఊదా రంగులో ఉన్న బంగాళాదుంప కూరను ఆహారంలో ఇచ్చారు. తర్వాత వారిలో రక్తపోటు తగ్గిందని పరిశోధనలో తేలింది. దీనిని బట్టి బంగాళాదుంపను వేపుళ్లుగా తీసుకోవడం కన్నా మామూలుగా దాని కూరను తినడమే మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.