కాలిఫోర్నియాలో ఒమిక్రాన్ దూకుడు - మాస్క్ తప్పనిసరి చేసిన అధికారులు
అమెరికాను ఒమిక్రాన్ వైరస్ భయపెడుతుంది. ముఖ్యంగా, కానిఫోర్నియా నగరంలో ఈ వైరస్ దూకుడు మరింత ఎక్కువగా ఉంది. గత రెండు వారాల వ్యవధిలో ఏకంగా 47 శాతంపైగా ఒమిక్రాన్ కేసులు పెరిగాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది.
దీనికితోడు వారాంతపు సెలవుల్లో తమ స్నేహితులు, బంధువులను కలుసుకునే అవకాశం ఉండటంతో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలను అమలకు నడుంబిగించింది. విధిగా మాస్క్ ధరించాలని ఈ నిబంధన వచ్చే నెల 15వ తేదీ వరకు అమల్లో ఉంటుందని స్పష్టంచేసింది.
ప్రస్తుతం ప్రతి ఒక్కరితో పాటు అన్ని దేశాలను భయపెడుతున్న కరోనా, ఒమిక్రాన్ వంటి వైరస్‌లను కట్టడి చేయడానికి తమ వద్ద ఉన్న ఏకైక ఆయుధం మాస్కేనని, అదొక్కటే బాగా పనిచేస్తుందని హెల్త్ అండ్ హ్యూమ్ సర్వీసెస్ సెక్రకటీ డాక్టర్ మార్క్ ఘాలే వెల్లడించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి జాగ్రత్తగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.