ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (13:02 IST)

నెల్లూరును వణికిస్తున్న చెన్నై .. కొత్తగా 19 కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదులో ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఫలితంగా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 9,986 శాంపిళ్లను పరీక్షించగా మరో 98 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 
 
మరోవైపు, 24 గంటల్లో 29 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 3,377 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 1,033 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,273 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 71కి చేరింది.
 
అయితే, గురువారం నమోదైన 98 కొత్త కేసుల్లో 19 కేసులు చెన్నై నుంచి వచ్చిన కేసులు కావడం గమనార్హం. చెన్నై నుంచి జిల్లాలోని వివిధ గ్రామాలకు వెళ్లిన వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 19 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో వారిని కోవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.