Webdunia - Bharat's app for daily news and videos

Install App

#CoronavirusStrain యూకే నుంచి భారత్‌కు కరోనా 2.O.. ఢిల్లీ మీదుగా చెన్నైకి..!?

Written By సెల్వి
Updated: మంగళవారం, 22 డిశెంబరు 2020 (14:58 IST)
corona virus
యుకే నుండి ఢిల్లీ మీదుగా చెన్నైకి తిరిగి వచ్చిన ఒక ప్రయాణీకుడుకి మంగళవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇది కరోనా వైరస్ కొత్త జాతా కాదా అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. అతని నమూనాలను పూణేకి పంపించారు. ఇప్పటివరకు 14 మంది ప్రయాణికులను యుకె నుండి తిరిగి వచ్చిన వారిగా గుర్తించి వారిని పర్యవేక్షిస్తున్నారు. యుకె నుండి అన్ని విమానాలను భారత్ నిషేధించింది.
 
దేశంలో కొత్త వైరస్ అడుగుపెట్టినా సరే మన దేశం అప్రమత్తంగా ఉందని భారత వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. యుకె నుంచి వచ్చే విమానాలను మన దేశం సహా చాలా దేశాలు నిషేధించాయి. విమాన ప్రయాణ నిషేధం డిసెంబర్ 31 న రాత్రి 23:59 వరకు ఉంటుంది. అన్ని యుకె విమానాల సస్పెన్షన్ మంగళవారం రాత్రి నుండి ప్రారంభమవుతుంది. 
 
దీనికి కరోనా స్ట్రెయిన్‌గా పేరుపెట్టారు. దక్షిణాఫ్రికా సహా చాలా దేశాల్లో ఇది అడుగుపెట్టింది. ఇక అక్కడి ప్రజల్లో కూడా ఒకరకమైన భయం అనేది మొదలయింది. ఈ నేపథ్యంలో యుకెలో లాక్ డౌన్ విధించారు. అక్కడ నాలుగో లాక్ డౌన్‌ని అమలు చేస్తున్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం కొత్త వేరియంట్ 70 శాతం ఎక్కువ వేగంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఇది ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్‌తో కట్టడి అవుతుందని భావిస్తున్నారు.

అన్నీ చూడండి

Santosh Shoban: మల్టీవర్స్ కామెడీగా సంతోష్ శోభన్ చిత్రం సత్తిబాబు పరలోక యాత్ర లుక్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10‌: ఛాన్స్ వచ్చింది కానీ.. అమ్మ కోసం వెళ్లలేదు.. సుప్రిత

Sampoornesh Babu :నా కెరీర్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి - .అయినా రెమ్యూనరేషన్ పరంగా హ్యాపీ : సంపూర్ణేష్ బాబు

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం, దేవిక భట్ జంటగా KA13 స్పెషల్ పోస్టర్‌

Eesha Rebba : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ నిజమే అనేలా వినాయకుడి పూజ !

తర్వాతి కథనం
Show comments