శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 జులై 2021 (12:03 IST)

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా 29,689 కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. సోమవారం కొత్తగా 29,689 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ మొదలైన తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇది మొదటి సారి.. సోమవారం నమోదైన కేసులతో కలిపి దేశంలో 3,14,40,951కు చేరింది. ఇక సోమవారం 42,363 మంది కోలుకున్నారు.
 
మరణాల విషయానికొస్తే సోమవారం 415 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య కూడా చాలావరకు అదుపులోకి వచ్చింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,21,382కు పెరిగింది.
 
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,06,21,469 మంది కోలుకున్నారు. 3,98,100 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 44,19,12,395 వ్యాక్సిన్ డోసులు వేశారు. అత్యధిక యాక్టివ్ కేసులు కేరళలో ఉన్నాయి.