శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: మంగళవారం, 10 మార్చి 2020 (13:43 IST)

కరోనా భయం: ఇంట్లో నుంచి కదలని ఇటలీ ప్రధాని, మీరు కూడా రావద్దంటూ సూచన

రోమ్(ఇటలీ): ఇటలీ దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భయంతో ఆ దేశ ప్రధానమంత్రి గియుసేప్ కాంటే మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటలీ దేశంలో సిరీస్ ఏతో పాటు అన్ని రకాల క్రీడల టోర్నమెంట్లను రద్దు చేస్తున్నామని ఇటలీ దేశ ప్రధానమంత్రి గియుసేప్ కాంటే చెప్పారు. 
 
కరోనా వైరస్ ప్రబలుతున్నందున ప్రజల ప్రయోజనార్థం దేశంలోని అన్ని క్రీడల పోటీలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని ప్రకటించారు. క్రీడల పోటీల సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు గుమిగూడే అవకాశమున్నందు వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందని, అందుకే అన్ని క్రీడల పోటీలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి చెప్పారు.
 
‘‘ఇటలీ దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతున్నందు వల్ల మన అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంది, మన ఇటలీ దేశ ప్రయోజనాల కోసం మనం కొన్నింటిని త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగా మనం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే నేను కూడా ఇంట్లోనే ఉంటున్నాను’’ అని ఇటలీ ప్రధానమంత్రి కాంటే చెప్పారు.