Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌పై కరోనా పడగ ... మరో 82 కొత్త కేసులు

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (13:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కరోనా పడక విసిరింది. దీంతో గత 24 గంటల్లో కొత్తగా మరో 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 1259కి చేరింది. 
 
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 5,783 శాంపిళ్ళను సేకరించి పరీక్షించగా 82 మందికి కోవిడ్ 19 సోకినట్టు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1,259 పాజిటివ్ కేసులకు గాను 258 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారని వివరించింది.
 
ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 970గా ఉందని తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 1, చిత్తూరులో 1, గుంటూరులో 17, కడపలో 7, కృష్ణాలో 13, కర్నూలులో 40, నెల్లూరులో 3 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
 
ఇకపోతే, జిల్లాల వారీగా పాజిటివ్ కేసులను పరిశీలిస్తే, అనంతపురం 54, ఈస్ట్ గోదావరి 74, గుంటూరు 39, గుంటూరు 254, కడప 65, కృష్ణ 223, కర్నూలు 332, నెల్లూరు 82, ప్రకాశం 56, శ్రీకాకుళం 4, విశాఖపట్టణం 22, వైస్ట్ గోదావరి 54 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

అన్నీ చూడండి

ఓటరు కార్డు చిరునామా మార్చుకోమంటుంటే ప్రభుత్వాన్నే మార్చేస్తానంటారేంటి ప్రకాష్ రాజ్?!! వీడియో

హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?

దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’

నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్

తర్వాతి కథనం
Show comments