మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (12:19 IST)

భారత్‌లో విజృంభణ.. అయినా రికవరీ రేటు రికార్డు

భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తూనే వుంది. లాక్ డౌన్ సడలింపుతో రోజుకు లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే కొద్దిరోజులుగా తొంభై వేలకు దగ్గరలో నమోదవుతున్న కేసులు సోమవారం భారీగా తగ్గాయి. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 55 లక్షలు దాటింది. గడచిన 24 గంటలలో 75,083 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 1,053 మంది మృతి చెందారు.
 
అలానే గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 1,01,468గా ఉంది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 55, 62,664కు చేరగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా 9,75,861 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 44,97,868కు చేరింది. 
 
అలానే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 88,935 కు చేరింది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 80.12 శాతానికి చేరింది. ఇక కరోనా వైరస్ నుండి 1,01,468 మంది సోమవారం ఒక్క రోజే కోలుకోవడం సరికొత్త రికార్డ్. ఇకపోతే.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. 70లక్షల కేసులతో అగ్రరాజ్యం అమెరికా తొలి స్థానంలో ఉంది.