మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 జనవరి 2021 (10:53 IST)

దేశంలో 20 వేల దిగువకు పడిపోయిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో ఈ కేసుల సంఖ్య 20 వేలకు దిగువకు పడిపోయాయి. గత 24 గంటల్లో 18,177 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసింది.
 
అలాగే, 20,923 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,23,965కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 217 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,49,435కు పెరిగింది. 
 
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 99,27,310 మంది కోలుకున్నారు. 2,47,220 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 17,48,99,783 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,58,125 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
ఇకపోతే, తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 574 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,87,502కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,80,565 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,549కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 5,388 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 3,210 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 81 కరోనా కేసులు నమోదయ్యాయి.