కుంభమేళాలో బుసలుకొట్టిన కరోనా.. 17000 మందికి కరోనా
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో కరోనా బుసలు కొట్టింది. ఐదు రోజుల వ్యవధిలోనే అక్కడ 1701మంది కరోనా బారిన పడినట్టు అధికారులు వెల్లడించారు. కుంభమేళా జరిగిన ప్రదేశంలో ఏప్రిల్ 10 నుంచి 14 వరకు మొత్తంగా 2,36,751 శాంపిల్స్ పరీక్షించగా..1701మందికి పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు.
భక్తజనంతో పాటు పలువురు సాధువులకు ఆర్టీ పీసీఆర్, ర్యాపిడ్ యాంటీ జెన్ పరీక్షలు నిర్వహించామన్నారు. ఇంకా కొన్ని ఆర్టీ పీసీఆర్ పరీక్షల నివేదికలు రావాల్సి ఉందని తెలిపారు. దీంతో కరోనా బాధితుల సంఖ్య 2వేలకు చేరే అవకాశం ఉందని హరిద్వార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ శంభూకుమార్ ఝా వివరించారు.