Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా వైరస్ కేసులు 47905 - తెలంగాణాలో...

Written By ఠాగూర్
Updated: గురువారం, 12 నవంబరు 2020 (12:53 IST)
దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 47,905 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 86,83,917కి చేరింది. ఇక గత 24 గంటల్లో 52,718 మంది కోలుకున్నారు. 
 
గడచిన 24 గంట‌ల సమయంలో 550 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,28,121 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 80,66,502 మంది కోలుకున్నారు. 4,89,294 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో బుధవారం వరకు మొత్తం 12,19,62,509  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. బుధవారం ఒక్కరోజులోనే 11,93,358  శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
తెలంగాణాలో... 
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 1,015 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,716 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,54,666కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,35,950 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,393కి చేరింది. ప్రస్తుతం 17,323 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
వారిలో 14,694 మంది హోంక్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 172 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 98 కేసులు నిర్ధారణ అయ్యాయి. 

అన్నీ చూడండి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

Balakrishna: కుర్చీలోనే బాలక్రిష్ణకు రక్షాబంధన్ కట్టిన తోబుట్టువులు

Kittu Pavan: తెలంగాణా ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌ హీరోగా చిత్రం ప్రారంభమైంది

తర్వాతి కథనం
Show comments