శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2020 (11:05 IST)

దేశంలో 43 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు - తెలంగాణాలో 916కు చేరిన కరోనా మృతులు

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 43,70,129కు చేరింది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా మరో 89,706 మందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం వెల్లడించిన బులెటిన్‌లో పేర్కొంది. అదేసమయంలో 1,115 మంది మృతి చెందారు. 
 
వీటితో కలుపుకుంటే.. మృతుల సంఖ్య మొత్తం 73,890కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 33,98,845 మంది కోలుకున్నారు. 8,97,394 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో మంగళవారం వరకు మొత్తం 5,18,04,677 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,54,549 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
మరోవైపు, తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,479 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,47,642కు పెరిగింది. 
 
మంగళవారం ఒక్క రోజే కరోనా బారినపడి 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 916కు పెరిగింది. గత 24 గంటల్లో 62,649 మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 18,90,554కు పెరిగింది.
 
ఇక, ఇప్పటివరకు 1,15,072 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 2,485 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 31,654 కేసులు యాక్టివ్‌గా ఉండగా, హోం, సంస్థాగత ఐసోలేషన్‌లో 24,471 మంది ఉన్నట్టు ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్ ద్వారా తెలుస్తోంది.