సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (19:59 IST)

క్లినికల్ ట్రయల్స్ చివరిదశకు చేరుకున్న చైనా వ్యాక్సిన్లు

కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా పేరుగాంచిన చైనా వ్యాక్సిన్ విషయంలో దూసుకొని పోతున్నది. చైనా జాతీయ పార్మా గ్రూప్ సినోపార్మ్, సినోవాక్ బయోటెక్ సంయుక్తంగా మూడు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయి. మరో వ్యాక్సిన్‌ను కాన్సినో బయోలాజిక్స్ తయారుచేసింది.
 
ఈ నాలుగు చైనా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో చివరిదశకు చేరుకున్నాయి. ఇవి ఆఖరిదైన మూడో దశ మానవ ప్రయోజనాల్లో ఉన్నాయని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్ వెల్లడించింది. వీటిలో మూడు నవంబర్ నాటికి ప్రజలకు అందుబాటులోనికి వస్తాయని తెలిపింది. ప్రస్తుతం వీటి ప్రయోజనాలు సజావుగా కొనసాగుతున్నాయని తెలిపింది.
 
దీనిపై సీడీసీ బయోసేప్టీ నిపుణుడు గైఝెన్ వూ మాట్లాడుతూ గత ఏప్రిల్ లోనే తను వ్యాక్సిన్‌ను తీసుకున్నానని ఇప్పటివరకు ఎలాంటి విపరీతమైన మార్పులు కనిపించలేదని, తను ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించారు. కాగా కాన్సినో బయోలాజిక్స్ తయారుచేసిన వ్యాక్సిన్‌ను సైన్యం వినియోగించేందుకు చైనా ప్రభుత్వం జూన్ లోనే అనుమతిచ్చింది.