గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (21:34 IST)

కరోనా విజృంభణ.. విద్యాశాఖ మంత్రి సతీమణికి కరోనా పాజిటివ్

ఒడిశాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒడిశాలో ఇప్పటివరకు ఏడుగురు రాష్ట్ర మంత్రులు, 22 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు కోవిడ్ భారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఒడిశా స్కూల్ అండ్ మాస్ ఎడ్యూకేషన్ మినిస్టర్ సమీర్ రంజన్ దాస్‌, ఆయన భార్య సంగీతా దాస్‌ కోవిడ్ భారిన పడ్డారు. టెస్ట్ ఫలితాల్లో ఇరువురికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా వచ్చినట్లు మంత్రి స్వయంగా వెల్లడించారు. 
 
గత వారం రోజుల్లో తనతో సన్నిహితంగా మెలిగినవారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా మంత్రి సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీర్ మోహంతీ సైతం స్పందిస్తూ తను కూడా కరోనా వైరస్ భారిన పడ్డట్లు వైద్యుల సలహా మేరకు భువనేశ్వర్ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే బీజేపీ లోక్‌సభ ఎంపీ సురేశ్ పూజారి, ఎమ్మెల్యే సుకంతా కుమార్ నాయక్ లకు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది.