భార్య దోసెలు చేసి పెట్టలేదని మనస్తాపం.. ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని భర్త..?

dosa
dosa
సెల్వి| Last Updated: సోమవారం, 14 సెప్టెంబరు 2020 (11:00 IST)
చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆధునికత అనే పేరే కానీ.. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఓపిక నశిస్తోంది. దీంతో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఓ భర్త దోసెలు చేసి పెట్టలేదన్న కోపంతో భర్త నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కుండ్రత్తూర్‌ నందంబాక్కం పెరియార్‌నగర్‌కు చెందిన రవిచంద్రన్‌(66) మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజూ తాగి వచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు. శనివారం రాత్రి పూటుగా తాగొచ్చిన రవిచంద్రన్‌... తనకు దోసెలు వేసివ్వాలని భార్యను అడిగాడు. ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

ఆవేశానికి గురైన రవిచంద్రన్‌ తన ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి ఆయన్ను క్రోంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనపై కుండ్రత్తూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.దీనిపై మరింత చదవండి :