శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (10:05 IST)

విడాకులిచ్చినా భార్య సంతోషంగా వుంటే జీర్ణించుకోలేకపోయాడు... చివరికి ఏం చేశాడంటే?

భార్యాభర్తల సంబంధాలు రోజు రోజుకు విలువ లేకుండా పోతున్నాయి. ఈ మధ్య వివాహేతర సంబంధాల కోసం, స్వార్థాల కోసం జీవితం గడిపే వారి సంఖ్య పెరగిపోయింది. తాజాగా ఎన్నికల కోసం కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చాడు ఓ భర్త. ఆ తర్వాత భార్య సంతోషంగా ఉండడాన్ని చూసి జీర్ణించుకోలేక దారుణానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. సర్పంచ్ పదవి కోసం తన రెండో భార్యకు విడాకులు ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ రెండో భార్య మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడానికి మాత్రం చూసి జీర్ణించుకోలేకపోయారు. చివరికి రెండో భార్య రెండో భర్తని హత్య చేయాలనుకున్నాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ దారుణ ఘటన వరంగల్‌లోని కమలాపూర్ మండలంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన ఎనకాల విజయ్ కుమార్ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు.. అయితే రెండు పెళ్లిళ్లు కావడంతో నిబంధనల ప్రకారం అది కుదరదు కాబట్టి రెండో భార్య జోత్స్నాకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత మున్సిపల్ ఉద్యోగిగా పనిచేస్తున్న జ్యోత్స్నా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది . కాగా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. భార్య సంతోషాన్ని చూసి తట్టుకోలేకపోయాడు విజయ్ కుమార్. 
 
తన అనుచరులతో... రెండో భార్య భర్త తిరుపతిపై హత్యాయత్నం చేయించాడు. దీంతో నలుగురు వ్యక్తులు తిరుపతి పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తిరుపతి అపస్మారక స్థితిలోకి చేరుకోగానే అక్కడ నుంచి వెళ్ళిపోయారు నిందితులు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.