ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (13:45 IST)

తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్ స్ట్రెయిన్ కలకలం..

తూర్పుగోదావరి జిల్లా తుని రూరల్‌ మండలం తేటగుంట గ్రామంలో గురువారం కోవిడ్‌ స్ట్రెయిన్‌ కలకలం రేపింది. ఇటీవల ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వ్యక్తికి విశాఖ ఎయిర్‌ పోర్ట్‌లో కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. మరలా మార్చి 1న తుని లో పరీక్ష చేయగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఇతనిని వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
 
అలాగే దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఒకేసారి 17,407 కొత్త కేసులు వెలుగు చూశాయి. క్రితం రోజు 14,989 కేసులు నమోదయ్యాయి. వీటితో పోల్చుకుంటే నేడు భారీ తేడా కనిపిస్తోంది. ప్రస్తుతం మొత్తం కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 1.11 కోట్లకు పైగా చేరాయి. కొత్తగా 89మంది మరణించారు. మొత్తం నిన్నటివరకు కరోనా కారణంగా 1,57,435 మరణించారు.
 
ప్రస్తుతం దేశంలో 1,73,413 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం ఒక్కరోజే 14,031 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కరోనాను జయించినవారు 1.08 కోట్లకు పైబడగా.. ఆ రేటు 97.06 శాతంగా కొనసాగుతోంది. నిన్న 7,75,631 మందికి కోవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.