శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (13:22 IST)

అరె... కరోనా టీకా వేసినట్టే లేదే... : గవర్నర్ హరిచందన్

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ దంపతులు మూడో దశలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ కరోనా కో-వాక్సిన్ తీసుకున్నానని... అసలు ఇంజక్షన్ తీసుకున్నట్టే లేదని తెలిపారు. 
 
కరోనాను నియంత్రించడానికి వైద్య సిబంది ఎంతో కష్టపడుతున్నారన్నారు. కరోనాకు ప్రపంచమే వణికిపోయిన సందర్భాన్ని చూసామని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బాగానే ఉన్నట్లు చెప్పారు. 
 
అందరూ వాక్సిన్ తీసుకోవాలని కోరుకుంటున్నానన్నారు. రెండో డోసు మార్చ్ 30 తర్వాత తీసుకోవాలని వైద్యులు సూచించారని గవర్నర్ హరిచందన్ తెలిపారు.