శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (09:52 IST)

ఢిల్లీలో ముగ్గురు ఖాకీలకు కరోనా... డీసీపీతో సహా 30 మంది క్వారంటైన్

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ఇంకా విజృంభిస్తూనే ఉంది. ఈ వైరస్ సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయ. తాజాగా ఢిల్లీలో కరోనా విధుల్లో ఉండే పోలీసుల్లో ముగ్గురికి ఈ వైరస్ సోకింది. దీంతో ఒక డీసీపీతో పాటు.. మొత్తం 30 మంది పోలీసులను క్వారంటైన్‌కు పంపించారు. 
 
ప్రస్తుతం దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య భయపెట్టేలా పెరుగుతోంది. దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఢిల్లీలో 1510 కేసులు నమోదు కాగా, 28 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా ఇద్దరు ఏఎస్ఐలతోపాటు ఓ హెడ్‌కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారితో సన్నిహితంగా మెలిగిన డీసీపీ సహా 30 మందిని ముందు జాగ్రత్త చర్యగా సెల్ఫ్ క్వారంటైన్ చేశారు.