మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 నవంబరు 2020 (12:25 IST)

కరోనాకు టీకా.. డిసెంబర్ నాటికి 10 కోట్ల డోసులు.. భారత్‌లోనే..?

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. చలికాలం రావడంతో కరోనాకు రెక్కలు వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తేనే తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో నాలుగు రకాల కరోనా వ్యాక్సిన్‌లు ట్రయల్స్ ను నిర్వహిస్తున్నారు.
 
ఇందులో భాగంగా ఆక్స్ ఫర్డ్-సీరం ఇన్స్టిట్యూట్ కలిసి డెవలప్ చేస్తున్న కోవిషీల్డ్ టీకా మూడోదశ ట్రయల్స్‌లో ఉంది. ఫలితాలను బట్టి డిసెంబర్‌లో టీకాకు అత్యవసర అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే ఉత్పత్తి ప్రారంభిస్తారు. డిసెంబర్ చివరి వరకు 10 కోట్ల డోసులు అందుబాటులో ఉంచేలా సీరం ఇన్స్టిట్యూట్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ 10 కోట్ల డోసులను ఇండియాలోనే వినియోగిస్తారు.