మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (11:06 IST)

గణనీయంగా తగ్గిన కోవిడ్ యాక్టివ్ కేసులు...

corona visus
దేశంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పా
జిటివ్ కేసుల సంఖ్యతో పాటు.. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య 50 వేలకు దిగువకు చేరుకున్నాయి.
 
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3.21 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 5,379 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ముందురోజు కంటే వెయ్యి కేసులు అదనంగా వచ్చాయి. పాజిటివిటీ రేటు 1.67 శాతానికి చేరింది.
 
అలాగే, ఈ వైరస్ నుంచి మంగళవారం 7,094 మంది కోలుకున్నారు. కేరళలో 11 మరణాలు నమోదు కాగా.. దేశవ్యాప్తంగా మొత్తం 27 మంది మృతి చెందారు. క్రియాశీల కేసులు 50 వేలకు తగ్గాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 50,594(0.11 శాతం)కి చేరింది. 
 
ఈ రెండేళ్ల కాలంలో 4.44 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 98.70 శాతం మంది వైరస్‌ను జయించారు. ఇక ఇప్పటివరకూ 213 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. మంగళవారం 18.8 లక్షల మంది టీకా తీసుకున్నారని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.