గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (10:28 IST)

దేశంలో 24 గంటల్లో వైరస్ సోకి 396 మంది మృతి

దేశంలో కరోనా వైరస్ సోకి మరో 396 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, గత 24 గంటల్లో 9,119 మందికి ఈ వైరస్ సోకింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ బులిటెన్ మేరకు దేశవ్యాప్తంగా 9119మందికి కొత్తగా కరోనా వైరస్ సోకగా, 10264 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే, 396 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 539 రోజుల కనిష్టానికి చేరుకుంది. 
 
ఇకపోతే, దేశ వ్యాప్తంగా 109940 మంది కరోనా వైరస్ బారినపడిన పాజిటివ్ రోగులు వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. ఆ ప్రకారంగా ఇప్పటివరకు 3,39,67,962 మంది కోలుకోగా, 4,66,980 మంది మృత్యువాతపడ్డారు.