శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 మే 2021 (08:55 IST)

కరోనా వ్యాక్సిన్‌కు ముందు కోవిడ్ పరీక్ష తప్పనిసరి...

కరోనా వ్యాక్సిన్ వేసుకునే ముందు కోవిడ్ పరీక్ష తప్పనిసరి చేయాలని దేశ ప్రజల్లో 48 మంది కోరుతున్నారు. 27 శాతం మంది కరోనా టెస్ట్‌ అవసరం లేదని చెప్పారు. టీకా వేసేముందు కరోనా టెస్ట్‌ చేయాలా..? వద్దా..? అని లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ ఓ సర్వే చేసింది. 
 
ఇందులో దేశవ్యాప్తంగా 278 జిల్లాల్లో ఉన్న 16 వేల మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు. కరోనా సోకిన వారు పూర్తిగా కోలుకున్న తర్వాతే టీకా తీసుకోవాలని అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(సీడీసీ) ఇది వరకే తెలిపింది. 
 
ఒకవేళ ఏదైనా ఆర్‌ఎన్‌ఏ టీకా మొదటి డోసు తీసుకున్నాక కొవిడ్‌ వస్తే.. వ్యాధి పూర్తిగా తగ్గాకే రెండో డోసుకు వెళ్లాలని సూచించింది. ఎసింప్టమాటిక్‌గా ఉన్న కొవిడ్‌ పాజిటివ్‌లు టీకా తీసుకుంటే వారి రోగనిరోధక శక్తి అతిగా ప్రేరేపించబడి కొవిడ్‌ కాస్త ఎక్కువ కావడం లేదా పరిస్థితి విషమించే అవకాశం ఉందని వెల్లడించింది. 
 
'టీకా మొదటి లేదా రెండో డోసు తీసుకున్నాక మీకు తెలిసిన ఎంత మంది వారంలోనే కొవిడ్‌ బారినపడ్డారు' అని 7,946 మందిని ప్రశ్నించగా.. 20 శాతం మంది 5 లేదా ఎక్కువ మందికి ఇలా జరిగిందన్నారు. 15 శాతం మంది 3-4, 12 శాతం మంది ఇద్దరికి, 7 శాతం మంది ఒక్కరిని చూశామని వెల్లడించారు. 35 శాతం మంది ఇలాంటి కేసులను చూడలేదని తెలిపారు.