మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 మే 2020 (15:09 IST)

తెలంగాణ పోలీస్ శాఖలో తొలి కరోనా మరణం

కరోనా వైరస్ దెబ్బకు అనేక మంది చనిపోతున్నారు. తెలంగాణా రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారిలో 40 మంది చనిపోయారు. అయితే, కరోనా వైరస్ బారినపడుకుండా ప్రజలను కాపాడుతూ కోవిడ్ వారియర్స్‌లలో ఒకరైన పోలీసులు కూడా ఈ వైరస్ బారినపడి చనిపోతున్నారు. తాజాగా తెలంగాణ పోలీసు శాఖలో ఓ కరోనా మరణం నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర డీజీపీ కార్యాలయం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మన్సూరాబాద్‌కు చెందిన దయాకర్‌ రెడ్డి.. జియగూడలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయనకు కరోనా సోకగా ఆస్పత్రిలో ఉంటూ చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, బుధవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి... మృతుడు దయాకర్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని డీజీపీ భరోసానిచ్చారు. అలాగే దయాకర్ రెడ్డి అంత్యక్రియలు కేవలం ఐదుగురితో జరిపించారు.