గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జులై 2021 (16:41 IST)

తెలుగు రాష్ట్రాల్లో కరోనా బులిటెన్ : తగ్గుముఖం పడుతున్న కోవిడ్ కేసులు (video)

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 90,574 మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా... 3,841 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 760 కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 45 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 38 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. మరోవైపు 3,963 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
తాజా గణాంకాలతో కలిసి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 18,93,354కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 18,42,432 మంది కోలుకున్నారు. 12,744 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38,178 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
 
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 869 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 8 మంది కరోనాతో మృతి చెందారు. మరోవైపు 1,197 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 
తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 6,24,379కి చేరుకుంది. ఇప్పటి వరకు 6,07,658 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,052 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ రికవరీ రేటు 97.32 శాతంగా ఉందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో 1,05,123 మందికి కరోనా పరీక్షలను నిర్వహించారు.