Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 17 జూన్ 2022 (12:36 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. వరుసగా రెండో రోజు 12 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో బాధితుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా గణాంకాలను వెల్లడించింది. 
 
గురువారం 5.19 లక్షల మందికి పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 12,847 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. కరోనా పాజిటివిటీ రేటు రెండు శాతంపైనే కొనసాగుతోంది. మహారాష్ట్ర(4,255), కేరళ(3,419), దిల్లీ(1,323), కర్ణాటక(833), తమిళనాడు, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. 
 
క్రియాశీల కేసులు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 63,063కి చేరింది. దీంతో మొత్తం కేసుల్లో బాధితుల వాటా 0.15 శాతానికి పెరిగింది. నిన్న 7,985 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.64 శాతానికి తగ్గిపోయింది. 24 గంటల వ్యవధిలో 14 మంది మరణించారు. నిన్న 15.27 లక్షల మంది టీకా తీసుకోగా.. మొత్తంగా 195.8 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయినట్లు కేంద్రం తెలిపింది.

అన్నీ చూడండి

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా

Balakrishna: బాలయ్యతో మళ్లీ జతకట్టనున్న విజయశాంతి?

Master Arun: సమ్మర్ హాలిడేస్ సినిమా నుంచి ఫ్రెండ్షిప్ సాంగ్ రిలీజ్

కన్నడలో యష్‌ తో చేయాల్సింది - బాబీ నన్ను ఎంకరేజ్ చేశారు : డైరెక్టర్ జనకిరామ్ మారెళ్ల

Teja Sajja: ది ట్రెయిటర్స్ గేమ్ మిస్టరీ గా ఉంటుంది, జాంబీ రెడ్డి 2 చిత్రీకరిస్తున్నాం తేజ సజ్జ

తర్వాతి కథనం
Show comments