ఆంధ్రప్రదేశ్ అన్‌లాక్ 4.0 గైడ్‌లైన్స్‌ ఇవే...

సోమవారం, 7 సెప్టెంబరు 2020 (13:08 IST)
అన్‌లాక్ 4.0 గైడ్‌లైన్స్‌‌ను ఆంధ్రప్రదేశ్ సర్కారు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు, విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. అటు కంటైన్మెంట్ జోన్లలో కూడా ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. 
 
అటు సెప్టెంబర్ 21 నుంచి 9-12 తరగతుల విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా.. ఇందుకు తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక అంగీకారం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఏపీ సర్కార్ జారీ చేసిన మరికొన్ని మార్గదర్శకాల సంగతికి వస్తే...
 
* ప్రాజెక్టులు, పరిశోధనల కోసం పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు అనుమతి 
* సెప్టెంబర్ 21 నుండి 100 మందికి మించకుండా సామాజిక, విద్య, స్పోర్ట్స్, మతపరమైన, పొలిటికల్ సమావేశాలకు అనుమతి
* సెప్టెంబర్ 20 నుంచి పెళ్లిళ్లకు 50 మంది అతిథులతో అనుమతి, అంతక్రియలకు 20 మందికి అనుమతి
 
* సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్‌లకు అనుమతి నిరాకరణ
* ఈ నెల 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరుచుకోవచ్చు.
* సెప్టెంబర్ 21 నుంచి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లకు అనుమతి ఇస్తున్నట్లు ఏపీ సర్కారు తెలిపింది.

అన్నీ చూడండి

Nagabandham Review: సనాతన ధర్మం కోసం తీసినా ఆకట్టుకోని నాగబంధం మూవీ రివ్యూ

జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ ఇమ్మోర్టల్ నుంచి రాకాసి సాంగ్

Rajamouli: ఫ్రాన్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ లూమియర్ వారి 'వాల్ ఆఫ్ ఫిల్మ్‌మేకర్స్'లో ఎస్.ఎస్. రాజమౌళి పేరు

జగపతి బాబు, లయ నటించిన వదలా చిత్రం రిలీజ్ కు సిద్ధం

Mythri Movie Makers: ధృవ్ విక్రమ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ చిత్రం

తర్వాతి కథనం
Show comments