బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2017 (06:58 IST)

వీర కుమ్ముడు... 73 బంతుల్లో 161 ర‌న్స్... ఎవరు? (Video)

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆడ‌మ్ లిత్‌ దుమ్మురేపాడు. నాట్‌వెస్ట్ టీ20 క్రికెట్ టోర్న‌మెంట్‌లో యార్క్‌షైర్ ఓపెన‌ర్ ఆడ‌మ్ లిత్‌ 73 బంతుల్లో 161 ర‌న్స్ చేశాడు. గురువారం హెడింగ్‌లేలో జ‌రిగిన మ్యాచ్‌లో ఈ ప‌రుగ

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆడ‌మ్ లిత్‌ దుమ్మురేపాడు. నాట్‌వెస్ట్ టీ20 క్రికెట్ టోర్న‌మెంట్‌లో యార్క్‌షైర్ ఓపెన‌ర్ ఆడ‌మ్ లిత్‌ 73 బంతుల్లో 161 ర‌న్స్ చేశాడు. గురువారం హెడింగ్‌లేలో జ‌రిగిన మ్యాచ్‌లో ఈ ప‌రుగుల హోరు సృష్టించాడు.
 
ఆడ‌మ్ ఇన్నింగ్స్‌లో 7 సిక్స‌ర్లు, 20 బౌండ‌రీలు ఉన్నాయి. నిర్ణీత ఓవ‌ర్ల‌లో యార్క్‌షైర్ 4 వికెట్ల‌కు 260 ర‌న్స్ చేయ‌గా, నార్తంప్ట‌న్‌షైర్ 136 ర‌న్స్‌కు ఆలౌటైంది. ఇపుడు ఆడమ్ లిత్ ఇదే ఆడ‌మ్ లిత్ హిట్టింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరూ ఓ లుక్కేయండి. 
 
కాగా, 2016లో ట్వంటీ-20 అరంగేంట్రం చేసిన ఆడమ్ లిత్ మొత్తం 85 మ్యాచ్‌లు ఆడి 1625 రన్స్ చేయగా, అత్యధికంగా 87 పరుగులే చేశాడు. కానీ, ఈ మ్యాచ్‌లో వీర కుమ్ముడు కుమ్మి ఏకంగా 161 రన్స్ చేశాడు.