బుధవారం, 27 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జులై 2022 (18:26 IST)

మహిళల ప్రపంచ కప్ నిర్వహణ కోసం బీసీసీఐ బిడ్డింగ్?

bcci
వచ్చే 2025లో 50 ఓవర్ల పరిమిత మహిళా ప్రపంచ కప్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలను నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బిడ్డింగ్ వేయాలని భావిస్తుంది. వరల్డ్ కప్ హోస్టింగ్ హక్కుల కోసం బిడ్డింగ్ వేయాలని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అదేసమయంలో ఈ హక్కులను బీసీసీఐ సొంతం చేసుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. 
 
గత 2013లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్, 2016 టీ20 ప్రపంచకప్ భారత్‌లోనే జరిగిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌‌లోని బర్మింగ్‌హామ్‌లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) త్వరలో వార్షిక మీటింగ్ జరగనుంది. 
 
ఈ సమావేశంలోనే 2025 మహిళల ప్రపంచకప్‌తోపాటు 2024, 2026 టీ20 ప్రపంచకప్ కోసం కూడా బిడ్లను స్వీకరిస్తుందని సమాచారం. గత ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఐదో స్థానంలో నిలిచింది. అంతకుముందు 2013లో స్వదేశంలో జరిగిన టోర్నీలో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.