మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 జులై 2020 (18:20 IST)

బెన్ స్టోక్స్ స్మోక్ చేశాడా? అదీ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లోనా?

Ben Stokes
ఐసీసీ ప్రపంచ కప్ పోటీలు గత ఏడాది జరిగిన సంగతి తెలిసిందే. ఫైనల్ పోరులో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సిగరెట్ కాల్చాడనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రపంచ కప్ పోటీలు ముగిసినప్పటికీ బెన్ స్టోక్స్ చేసిన స్మోకింగ్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
ప్రపంచంలో క్రికెట్ జట్లన్నీ ప్రపంచ కప్‌లో రాణించాలని కలలు కంటాయి. గత ప్రపంచ కప్ ట్రోఫీని ఇంగ్లండ్ జట్టు కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ కీలకంగా మారింది. ఇంగ్లండ్ జట్టు గెలుపులో బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు కొన్ని నిమిషాల ముందు తన గదిలో స్మోక్ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.