శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 17 జూన్ 2019 (13:59 IST)

వరల్డ్ కప్ 2019 : భారత్‌కు ఎదురుదెబ్బ.. మరో క్రికెటర్ ఔట్

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో భారత క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో చిటికెన వేలి గాయంతో ఓపెనర్ శిఖర్ ధావన్ రెండు వారాల పాటు జట్టుకు దూరమయ్యాడు. ఇపుడు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఫలితంగా మూడు మ్యాచ్‌లకు దూరంకానున్నాడు. 
 
ఆదివారం మాంచెష్టర్ వేదికగా జరిగిన పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ భువీ గాయ‌ప‌డ్డాడు. తొడ కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో రెండు ఓవ‌ర్లు వేసిన భువీ మైదానం విడిచి వెళ్లాడు. ఎడ‌మ‌కాలి తొడ‌న‌రాలు గ‌ట్టిగా ప‌ట్టేయ‌డం వ‌ల్ల అత‌నికి కొంత విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.
 
ఫలితంగా ఈనెల 22వ తేదీన ఆఫ్ఘ‌నిస్తాన్‌తో, 27వ తేదీన వెస్టిండీస్‌ల‌తో జ‌రిగే మ్యాచ్‌ల‌కు భువీ దూరంకానున్నాడు. ఇక జూన్ 30వ తేదీన ఇంగ్లండ్‌తో జ‌ర‌ుగ‌నున్న మ్యాచ్‌కు భువీ అందుబాటులో ఉండేది లేనిది ఇప్పుడే చెప్ప‌లేమని వైద్యులు అంటున్నారు. అయితే, ఇంగ్లండ్ మ్యాచ్‌కు ముందుగానే భువీ కోలుకుంటాడనీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.