మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 22 జనవరి 2019 (10:34 IST)

సింపుల్‌గా చిన్నగుడిలో వివాహం చేసుకున్న క్రికెటర్ ఎవరు?

క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు అట్టహాసంగా వివాహం చేసుకోవడం చూసేవుంటాం. వివాహం కోసం క్రికెటర్లు, సెలెబ్రిటీలు భారీగా ఖర్చు పెట్టడం చూస్తూనే వుంటాం. అయితే ఓ రంజీ క్రికెటర్ సింపుల్‌గా గుడిలో వివాహం చేసుకున్నాడు. అతనెవరంటే.. రంజీ క్రికెటర్ ఎన్సీ అయ్యప్ప. కన్నడ నటి అనుపువ్వమ్మను ఎన్సీ అయ్యప్ప చిన్న గుడిలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. 
 
వీరిద్దరి నిశ్చితార్థం గత ఏడాది మేలో జరిగింది. తాజాగా వీరి వివాహం ఆలయంలో కొడవ సంప్రదాయంలో జరిగింది. ఆపై జరిగిన రిసెప్షన్‌కు పలువురు కన్నడ ప్రముఖులు హాజరయ్యారు. గడిచిన మూడేళ్ల పాటు వీరిద్దరూ ప్రేమలో వున్నారు. తల్లిదండ్రులు, బంధువుల సమ్మతంతో ఒక్కటయ్యారు. అయ్యప్ప క్రికెటర్‌గా, బిగ్ బాస్ రియాల్టీ షో కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకోగా, అనుపువ్వమ్మ పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.