సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 9 జనవరి 2019 (13:37 IST)

వర్జినిటీ కోల్పోయిన క్రికెటర్... సారీ చెప్పిన హార్దిక్ పాండ్యా

పాపులర్ టీవీ టీవీ షో 'కాఫీ విత్ కరణ్‌'లో తాను చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా క్షమాపణలు చెప్పారు. ఆ షోలో తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించివున్నా, మనసు నొప్పించివున్నా క్షమాపణలు కోరుతున్నట్టు తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఓ పోస్ట్ చేశాడు. 
 
ఈ పోస్ట్‌లో "ఆ షో తీరు అలా ఉండటంతో నేను కూడా కాస్త హద్దుమీరాను. అంతేగానీ ఇతరను నొప్పించాలన్న ఉద్దేశ్యంతో అలా చేయలేదన్నారు. ఒకవేళ ఎవరి మనోభావాలను దెబ్బతీసివుంటే క్షమించమని అడుగుతున్నా. షో తీరు అలా ఉండటంతో నేను కూడా కాస్త హద్దు మీరాల్సి వచ్చిందన్నారు. అంతేకానీ, ఎవరి మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశ్యం కాదన్నారు. 
 
కాగా, కాఫీ విత్ కరణ్‌ షోలో పాల్గొన్న హార్దిక్ పాండ్యా... తన తల్లిదండ్రులతో కలిసి ఓ పార్టీకి వెళ్ళింది, తనకు అమ్మాయిలతో ఉన్న సంబంధాలు, తాను వర్జినిటీ కోల్పోయిన సంఘటనను తన తల్లిదండ్రులకు ఎలా చెప్పానన్న విషయం తదితర అంశాలను బోల్డ్‌గా వెల్లడించాడు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్షమాపణలు చెప్పారు.