వన్డే సిరీస్ ఓడిపోయివుంటే ధోనీని ఇంటికిపంపేవారు : సౌరవ్ గంగూలీ
స్వదేశంలో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కోల్పోయివుంటే కెప్టెన్సీ పదవికి ముప్పు వచ్చేది వుండేదని భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్
స్వదేశంలో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కోల్పోయివుంటే కెప్టెన్సీ పదవికి ముప్పు వచ్చేది వుండేదని భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను భారత జట్టు 3-2 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెల్సిందే.
దీనిపై గంగూలీ స్పందిస్తూ... శనివారం విశాఖపట్నం వన్డేలో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైవుంటే ధోనీ కెప్టెన్ పదవికి ఎసరు తెచ్చేదని, కెరీర్‌పైనే ప్రభావం చూపేదన్నారు. ఈ గెలుపు ధోనీకి అతి ముఖ్యమైనదని, ఇండియా సిరీస్ గెలవడంతో ధోనీ ముందుకు రావాల్సిన ఎన్నో ప్రశ్నలు పక్కకెళ్లి పోయాయని తెలిపాడు.
కీలకమైన మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవడం, తనను తాను నిరూపించుకోవాల్సిన సందర్భంలో దక్కిన విజయంతో ధోనీ ఎంతో ఊరట చెంది ఉంటాడని అన్నాడు. విజయం సాధించడానికి భారత్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయని ఈ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. అదేసమయంలో జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధోనీ నాలుగో నంబరు బ్యాట్స్‌మెన్‌గా క్రీజ్‌లోకి రావాలని కోరాడు.