సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2022 (10:00 IST)

దాయాదులతో సిరీస్‌.. ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తుందా?

india - pakistan
ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) దాయాదులతో సిరీస్‌కు ఆతిథ్యమిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఈసీబీ పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజాకు ప్రతిపాదన చేసింది. 
 
2007 డిసెంబరులో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య చివరిసారిగా టెస్టు మ్యాచ్ జరిగింది. రాజకీయ కారణాలతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లకు అవకాశమే లేకుండా పోయింది. 
 
2013 తర్వాత భారత్, పాకిస్థాన్ జట్లు కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే తలపడుతున్నాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ టీ20 జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. కానీ ఇందుకు బీసీసీఐ సుముఖంగా లేదని తెలుస్తోంది.