వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్.. ఆ ముగ్గురు శతక్కొట్టారు.. గిల్ అదుర్స్ రికార్డ్
వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 134.2 ఓవర్లలో 5 వికెట్లకు 518 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (258 బంతుల్లో 22 ఫోర్లతో 175), శుభ్‌మన్ గిల్ (196 బంతుల్లో 2 సిక్స్‌లతో 16 ఫోర్లతో 129 నాటౌట్) శతకాలతో విజృంభించారు.
నితీష్ కుమార్ రెడ్డి (54 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), ధ్రువ్ జురెల్ (79 బంతుల్లో 5 ఫోర్లతో 44), కేఎల్ రాహుల్ (54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 38) హాఫ్ సెంచరీలు చేజార్చుకున్నారు. వెస్టిండీస్ బౌలర్లలో జొమెల్ వారికన్(3/98) మూడు వికెట్లు తీయగా.. రోస్టన్ ఛేజ్ ఓ వికెట్ పడగొట్టాడు.
తాజాగా గిల్ చేసిన సెంచరీతో విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన సారథిగా కోహ్లితో గిల్ సమంగా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గిల్ ఐదో సెంచరీ చేయడం గమనార్హం. విరాట్ 2017, 2018 సంవత్సరాల్లో ఐదేసి సెంచరీలు కొట్టాడు. ప్రస్తుతం విండీస్ ఒక వికెట్ కోల్పోయి 30 పరుగుల వద్ద కొనసాగుతోంది.